Subhodayam Media, 26 నవంబర్ 2026: 
మహాదాతృత్వానికి నిదర్శనం.. శ్రీవారికి రూ.207.6 కోట్ల విలువైన 121 కిలోల బంగారు ఆభరణాల సమర్పించినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) గురువారం అధికారికంగా వెల్లడించింది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో చెన్నైకి చెందిన దాతలు వర్ధమాన్ జైన్, రాధిక జైన్ దంపతులు 46 రకాల ఆభరణాలను శ్రీవారికి సమర్పించినట్టు పేర్కొన్నారు. శ్రీవారికి సమర్పించిన ఆభణాల జాబితాను తితిదే అధికారులు ఎక్స్ వేదికగా అధికారికంగా వెల్లడించారు. ఆ ఆభరణాల జాబితా…
1. పాద కవచములు – 2
2. అందెలు – 2
3. పాగడా – 1
4. తులసిపత్ర హారము – 1
5. అష్టోత్తర శత కాసుల మాల – 1
6. చతుర్భుజ లక్ష్మీ హారము – 1
7. పులిగోరు – 1
8. అశ్వత్థ పత్ర హారము – 1
9. సాదా వడ్డాణము – 1
10. గంటల మొలత్రాడు – 1
11. సూర్య కఠారి – 1
12. కౌస్తుభం – 1
13. శ్రీవత్సం – 1
14. మోచేయి – 1
15. కటి హస్తము పై రేకు – 1
16. నాగాభరణ వడ్డాణము – 1
17. గోపు – 1
18. ఐదు పేటల కంఠెలు – 5
19. చంద్రవంకీ కంఠి – 1
20. వైకుంఠ హస్తము – 1
21. కటి హస్తము – 1
22. నాగాభరణ కడియములు – 2
23. నాగాభరణములు – 2
24. భుజకీర్తులు – 2
25. కర్ణ పత్రములు – 2
26. బావులీలు – 2
27. శాలిగ్రామ హారము – 2 (02 Parts)
28. కమలం తరహా శాలిగ్రామ హారములు – 2 (02 Parts)
29. శీమ కమలముల మోపుగల యజ్ఞోపవీతం – 1
30. శంఖము కవచము – 1
31. చక్రము కవచము – 1
32. ముఖపట్టి – 1
33. కిరీటము – 1