ప్రఖ్యాత హిందీ సాహిత్య పండితులైన డా. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ – పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డు గ్రహీత, విశ్వ హిందీ పరిషత్ జాతీయ అధ్యక్షులు, మాజీ రాజ్యసభ సభ్యులు, షాంఘైలో అక్టోబర్ 24-25, 2026 తేదీలలో జరగనున్న 10వ అంతర్జాతీయ తెలుగు సదస్సుకు ఆత్మీయ అతిథిగా హాజరుకావడానికి ప్రయాణిస్తున్న సందర్భంగా హాంగ్ కాంగ్ ను సందర్శించారు. ఆ సందర్బంగా వారు హాంకాంగ్ ,మకావ భారత కాన్సుల్ జనరల్ గౌరవనీయులు శ్రీ రాజేష్ ఎన్. నాయక్ గారిని సన్మాన సందర్శన చేశారు. ఆయనతో పాటు ది హాంగ్ కాంగ్ తెలుగు సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీమతి జయ పీసపాటి కూడా ఉన్నారు.

ఈ సమావేశం పరస్పర గౌరవం, వృత్తిపరమైన సౌజన్యం ,నిర్మాణాత్మకమైన ఆలోచనల మార్పిడితో నిండింది. ప్రత్యేకంగా, హిందీ భాష ప్రచారం ,అభివృద్ధి గురించి, అలాగే వార్షిక ‘హిందీ పఖ్వాడా’ (హిందీ పక్షం) వంటి కార్యక్రమాల ప్రాముఖ్యత గురించి వారు విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు.
ఈ సంభాషణ భారతీయ భాషా, సాంస్కృతిక విలువలను పరిరక్షించడానికి, విదేశాలలో హిందీ భాషను మరింత ప్రోత్సహించడానికి, మరియు హాంకాంగ్‌లో ప్రవాస భారతీయుల భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి సహకారాన్ని బలోపేతం చేసే దిశగా ఒక సానుకూల అడుగుగా నిలిచింది.