విజయవాడ తాడేపల్లిలోని APNRT కార్యాలయంలో APNRT చైర్మన్ శ్రీ వేమూరి రవి గారు, డైరెక్టర్ శ్రీ నాగేంద్ర బాబు గారిని మర్యాదపూర్వకంగా కలిసి, గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైల అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు భద్రతకు సంబంధించిన పలు అంశాలపై చర్చించడం జరిగింది.
ఈ సందర్భంగా చైర్మన్ వేమూరి రవి గారు ఎన్నారైల అభ్యున్నతి కోసం చేస్తున్న ఆలోచనలు, భవిష్యత్తు ప్రణాళికలు ఎంతో ఆశాజనకంగా అనిపించాయి. నాకు విలువైన సమయాన్ని కేటాయించి, ఎన్నారైల సమస్యలు, అవసరాలు, అభివృద్ధి అవకాశాలపై సుదీర్ఘంగా చర్చించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.

APNRT అంటే కేవలం సేవా కార్యక్రమాలకే పరిమితం కాకుండా… ఎన్నారైలకు ఆర్థిక భరోసా, సామాజిక భద్రత, స్వావలంబన కల్పించే దిశగా కూడా ముందుకు సాగాలి.
ఈ లక్ష్యంతో ఎన్నారైల భవిష్యత్తుకు ఉపయోగపడే విధానాల రూపకల్పనపై ఆలోచనలు సాగడం, రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనకరమైన పాలసీలను పరిచయం చేయాలనే దృక్పథం ఎంతో సంతోషాన్నిస్తోంది.
గల్ఫ్‌లో కష్టపడి పనిచేస్తున్న ప్రతి తెలుగు కుటుంబానికి భద్రత, భరోసా, అభివృద్ధి అవకాశాలు అందుబాటులోకి రావాలన్నదే నా ఆకాంక్ష.
సేవ నుంచి సాధికారత వైపు… సంక్షేమం నుంచి ఆర్థిక భరోసా వైపు… APNRT ప్రయాణం ఎన్నారైల జీవితాల్లో సానుకూల మార్పులకు నాంది కావాలని ఆశిస్తున్నాను.
సేవే లక్ష్యం… ఎన్నారైల అభివృద్ధే ధ్యేయం!
ఇట్లు,
M. వాసుదేవరావు
APNRT Gulf Regional Coordinator
Gulf Prime Journalist