
Subhodayam Media, 23 నవంబర్ 2026: Vijayawada Mayor Vangaveeti Radha : ఏపీలోని పలు నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాల్లో నూతన పాలకవర్గాలు కొలువుదీరాయి. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రమాణ స్వీకారం చేశారు. కాగా.. విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ నూతన మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణస్వీకారం చేశారు.
విజయవాడ నగరంలోని అంబేద్కర్ కళావేదికలో మేయర్, కార్పొరేటర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. తొలుత మేయర్‌గా వంగవీటి రాధాకృష్ణ ప్రమాణ స్వీకారం చేశారు. ఎన్నికల అధికారి హోదాలో కలెక్టర్ లక్ష్మీశ ప్రమాణం చేయించారు. ఆ తరువాత నగరంలోని 86 వార్డుల కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. నగరంలో 86 డివిజన్లలో టీడీపీ 53, జనసేన 19, వైసీపీ ఎనిమిది, బీజేపీ నాలుగు, సీపీఎం ఒక డివిజన్‌లో గెలిచిన విషయం తెలిసిందే.