కంకణాలపల్లి, సత్తెనపల్లి, 02-11-2026: కంకణాలపల్లి గ్రామానికి మొదట మంజూరైన తిన్నటి (స్ట్రెయిట్) రైల్వే అండర్‌పాస్ డిజైన్‌ను, తమ అనుమతి లేకుండా U-ఆకారంలోకి మార్చారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ మార్పు వల్ల భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు వస్తాయని, మొదట మంజూరైన డిజైన్ ప్రకారమే అండర్‌పాస్ నిర్మించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
U-షేప్ అండర్‌పాస్‌పై కంకణాలపల్లి గ్రామస్థుల ఆందోళన: తిన్నటి అండర్‌పాస్ కావాలని డిమాండ్. సత్తెనపల్లికి వెళ్లేందుకు గ్రామస్థులకు ఉన్న ఏకైక మార్గం ఇదేనని వారు తెలిపారు. ప్రజాస్వామ్యంలో ప్రజల అభిప్రాయం తీసుకోకుండా నిర్ణయాలు ఎలా తీసుకుంటారని వారు ప్రశ్నించారు.
గ్రామస్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలు:
- రాకపోకల ఇబ్బంది: U-ఆకార మలుపుల వల్ల వ్యవసాయ ఉత్పత్తులతో వెళ్లే భారీ ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహనాలు వెళ్లడం కష్టమవుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
- నీటి నిల్వ: వర్షాలు పడినప్పుడు పక్క పొలాల నుంచి వచ్చే నీరు అండర్‌పాస్‌లోకి చేరి నిలిచిపోతుందని, దీనివల్ల రాకపోకలు పూర్తిగా ఆగిపోతాయని వారు భయపడుతున్నారు.
- రాత్రి భద్రత: చీకటిగా, తీవ్రమైన మలుపులతో ఉండే ఈ మార్గంలో రాత్రివేళల్లో గ్రామస్థుల, ముఖ్యంగా మహిళల భద్రతకు ముప్పు ఉంటుందని వారు చెబుతున్నారు.
- అత్యవసర సేవలు: మలుపులు, నీటి నిల్వ వల్ల అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలు ఆలస్యమవుతాయని గ్రామస్థుల అభిప్రాయం.
ప్రజాప్రతినిధులకు విన్నపాలు
ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు రైల్వే అధికారులు మరియు రెవెన్యూ అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని గ్రామస్థులు వాపోయారు. ప్రజా ప్రతినిధులు, రైల్వే అధికారులు మరియు రెవెన్యూ అధికారులు గ్రామస్థులతో చర్చించి, వారి అభిప్రాయం ప్రకారం నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.
గ్రామస్థుల డిమాండ్
గ్రామానికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని గ్రామస్థులు స్పష్టం చేశారు. “U-షేప్ వద్దు – తిన్నటి అండర్‌పాస్ ముద్దు” అంటూ నినాదాలు చేశారు.
ఎన్నికల బహిష్కరణ ప్రకటన
తమ అభిప్రాయం తీసుకోకుండా డిజైన్ మార్చారని, పలుమార్లు విన్నవించినా ఎవరూ పట్టించుకోలేదని గ్రామస్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు. అందుకే అండర్‌పాస్ సమస్య పరిష్కారమయ్యే వరకు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించినట్లు వారు తెలిపారు. తిన్నటి అండర్‌పాస్ సాధించే వరకు ఓటు వేసేది లేదని గ్రామస్థులు స్పష్టం చేశారు.
“ఓట్ల కోసం గ్రామానికి వచ్చే ముందు నాయకులు మా కన్నీళ్లు చూడాలి” అని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు. ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి, గ్రామస్థులతో చర్చించి సమస్యను పరిష్కరించాలని కోరారు.