Subhodayam Media, 21 అక్టోబర్ 2026: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) పురుషుల సెలెక్షన్ కమిటీలో కీలక మార్పులు చేపట్టారు. అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో, సీనియారిటీ ప్రాతిపదికన మాజీ భారత స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజాను కొత్త చీఫ్ సెలెక్టర్‌గా నియమించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో, ఖాళీగా ఉన్న ఐదో సభ్యుడి స్థానంలో మాజీ స్పిన్నర్ రమేష్ పవార్‌ను ఎంపిక చేసినట్లు సమాచారం.
ఈ ఐదుగురు సభ్యుల సెలెక్షన్ ప్యానెల్ రాబోయే టీమిండియా సిరీస్‌లకు ఆటగాళ్లను ఎంపిక చేయనుంది. జట్టు కూర్పు, యువ ఆటగాళ్లకు అవకాశాలు, భవిష్యత్ క్రికెట్ ప్రణాళికల విషయంలో ఈ కమిటీ కీలక పాత్ర పోషించనుంది. కొత్త సెలెక్షన్ టీమ్ ఎంపికలు టీమిండియా ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి!