
వెంకట రాజా ట్రస్ట్ , చామర్రు వారి సౌజన్యంతో పల్నాడు జిల్లా అచ్చంపేట లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధిని , విద్యార్ధులకు ఉచిత కంప్యూటర్ శిక్షణ కార్యక్రమం అచ్చంపేట లోనీ స్థానిక పోస్టాఫీసు ప్రక్కన ప్రారంభించడం జరిగింది,
ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ ఉప్పల శ్రీనివాసమూర్తి CA గారి చేతుల మీదగా ప్రారంభించటం జరిగినది. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రసాద్ గారు, వైస్ ప్రిన్సిపల్ కాశినాయక్ గారు , కళాశాల సిబ్బంది , విద్యార్ధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ అధ్యక్షులు ఈ రోజులలో కంప్యూటర్ అవసరం గురించి వివరణ ఇవ్వడం జరిగినది.
ఇది ఆ ఊరిలో శ్రీ ఉప్పల వెంకటేశ్వర్లు, శ్రీమతి రాజేశ్వరి గార్ల పేర్ల మీద నెలకొల్పిన వెంకట రాజా ట్రస్ట్ ద్వారా సాగుతున్న సోషల్ సర్వీస్ లో భాగం. గత 4 ఏళ్లుగా ఆ గ్రామములో, చుట్టుపక్కల ఎన్నో సంఘ్ సేవ కార్యక్రమాలు చేయబడినవి… జరుగుతూ ఉన్నవి