బహ్రెయిన్, 30 అక్టోబర్ 2026: తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ (TCA Bahrain) ఆధ్వర్యంలో బహ్రెయిన్‌లో తెలంగాణ బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.

ముఖ్య అతిథులుగా ప్రముఖులు ప్రేమ్ సాగర్ గారు, వెంకట్ స్వామి గారు, కిశోర్ గారు, రాజశేఖర్ గారు హాజరై మహిళలు పేర్చిన బతుకమ్మలను తిలకించి, ఆడపడుచులతో కలిసి ఆడిపాడారు.

తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గల్ఫ్ దేశంలో చాటిచెబుతున్న TCA Bahrain కృషిని ముఖ్య అతిథులు అభినందించారు.

ఈ కార్యక్రమానికి వందలాది మంది తెలుగు కుటుంబాలు, మహిళలు, చిన్నారులు హాజరయ్యారు.

కృతజ్ఞతలు:
ఈ వేడుకను విజయవంతం చేసిన TCA సభ్యులకు, మహిళా విభాగానికి, వాలంటీర్లకు మరియు స్పాన్సర్లకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.

ఆధ్వర్యంలో: అధ్యక్షులు ఎండికోలె పోచయ్య ముదిరాజ్ గారు
సహకారం: దాసరి మురళి, మల్లేశన్న, సురేష్, పయ్యావుల శ్రీనివాస్, సంజీవ్ గాండ్ల, అభిలాష్, సుదర్శన్, రాజ్ కుమార్ తదితరులు.
- TCA Bahrain