షేర్: f 𝕏 ✉ ✈ in @
subhodayammedia.com 26 నవం 2026, 9:05 ఉద.
తెలంగాణ

Tarnaka traffic jam | రోడ్డు తవ్వ‌కాల‌తో తార్నాక మెయిన్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్‌.. వీడియో

subhodayam
ప్రచురణ తేదీ: 26 నవం 2026, 9:05 ఉద. రచన: Subhodayam Media
10 వీక్షణలు 0 వ్యాఖ్యలు
Tarnaka traffic jam | రోడ్డు తవ్వ‌కాల‌తో తార్నాక మెయిన్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్‌.. వీడియో

Tarnaka traffic jam | హైదరాబాద్ : తార్నాక ప్రధాన రహదారిపై భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. కేబుల్ పనుల కోసం రోడ్డు తవ్వకాలు చేప‌ట్టిన‌ కారణంగా వాహ‌న రాక‌పోక‌లు నెమ్మ‌దించాయి. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రద్దీ సమయాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోవడంతో తార్నాక మెయిన్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది. దీనివల్ల ఉదయం వేళల్లో ఉద్యోగులు సరైన సమయానికి కార్యాలయాలకు చేరుకోలేక, విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేక తీవ్ర అసహనానికి గురవుతున్నారు.

వాహ‌నాలు ఎక్క‌డిక‌క్క‌డ నిలిచిపోతుండ‌టంతో అత్య‌వ‌స‌ర సేవ‌లందించే అంబులెన్సులు కూడా ముందుక వెళ్ల‌లేని ప‌రిస్థితి నెల‌కొంటుంది. ఎమ‌ర్జెన్సీ వాహనాలు సైతం ట్రాఫిక్‌లో చిక్కుకుపోతుండటంతో స్థానికులు, వాహ‌న‌దారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి ఈ తవ్వకాల పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, ట్రాఫిక్ కష్టాల నుంచి విముక్తి కలిగించాలని వాహనదారులు కోరుతున్నారు.

#తెలంగాణ
Tarnaka traffic jam | హైదరాబాద్ : తార్నాక ప్రధాన రహదారిపై భూగర్భ విద్యుత్ కేబుల్ పనులు కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. కేబుల్ పనుల కోసం రోడ్డు తవ్వకాలు చేప‌ట్టిన‌…