షేర్: f 𝕏 ✉ ✈ in @
subhodayammedia.com 26 నవం 2026, 9:45 సా.
బ్రేకింగ్ న్యూస్

Nandi Awards Jury: ఏపీ సర్కార్ నంది అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా బాలకృష్ణ!

subhodayam
ప్రచురణ తేదీ: 26 నవం 2026, 9:45 సా. రచన: Subhodayam Media
7 వీక్షణలు 0 వ్యాఖ్యలు
Nandi Awards Jury: ఏపీ సర్కార్ నంది అవార్డుల జ్యూరీ ఛైర్మన్‌గా బాలకృష్ణ!

Nandi Awards Jury: ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘నంది’ అవార్డుల పండగకు రంగం సిద్ధమైంది. సినిమా, టెలివిజన్, నాటక రంగాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా 2025 సంవత్సరానికి గానూ అవార్డుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన జ్యూరీ కమిటీ ఛైర్మన్‌గా స్టార్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను నియమిస్తూ తాజాగా జీవో విడుదలైంది. ఏపీ స్టేట్ ఫిల్మ్, టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ప్రతిపాదనల మేరకు ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రకటించింది.

కమిటీ ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణ (ఎమ్మెల్యే), సభ్యులుగా అల్లు అరవింద్ (నిర్మాత), ఎస్.గోపాల్ రెడ్డి (సినీ ప్రముఖులు), ప్రభ (సీనియర్ నటి), కన్వీనర్‌గా APSFTvTDC మేనేజింగ్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వహించనున్నారు. గత కొన్నేళ్లుగా నిలిచిపోయిన 2017 నుంచి 2025 వరకు ఉన్న నంది అవార్డులన్నింటినీ త్వరలోనే అందించేందుకు ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఇందుకోసం ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసి, వచ్చే నెల అంటే డిసెంబర్‌లోనే అవార్డుల ప్రదానోత్సవ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ ప్రతిష్టాత్మక వేడుకను విజయవాడ లేదా అమరావతిలో ఘనంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. చాలా కాలం తర్వాత మళ్లీ నంది అవార్డుల సందడి మొదలవ్వడం, అందులోనూ బాలకృష్ణ ఛైర్మన్‌గా, అల్లు అరవింద్ లాంటి సీనియర్లు జ్యూరీ సభ్యులుగా నియమితులవడంతో సినీ, టీవీ వర్గాల్లో కొత్త ఉత్సాహం నెలకొంది.

#బ్రేకింగ్న్యూస్
Nandi Awards Jury: ఏపీలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘నంది’ అవార్డుల పండగకు రంగం సిద్ధమైంది. సినిమా, టెలివిజన్, నాటక రంగాలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల ఎంపిక…