షేర్: f 𝕏 ✉ ✈ in @
subhodayammedia.com 02 నవం 2026, 7:48 సా.
ఆంధ్రప్రదేశ్

గల్ఫ్ నుండి ఏపీకి డైరెక్ట్ విమాన సర్వీసులు నడపాలని కేంద్ర మంత్రికి వాసుదేవరావు విజ్ఞప్తి!

subhodayam
ప్రచురణ తేదీ: 02 నవం 2026, 7:48 సా. రచన: శుభోదయం
51 వీక్షణలు 0 వ్యాఖ్యలు
గల్ఫ్  నుండి ఏపీకి డైరెక్ట్ విమాన సర్వీసులు నడపాలని కేంద్ర మంత్రికి వాసుదేవరావు విజ్ఞప్తి!

గల్ఫ్ ప్రవాసాంధ్రులకు శుభవార్త దిశగా మరో ప్రయత్నం… ఏపీకి డైరెక్ట్ విమాన సర్వీసులు నడపాలని కేంద్ర మంత్రికి వాసుదేవరావు విజ్ఞప్తి!

నిమ్మాడలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో ఆత్మీయ భేటీ

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారి స్వగృహంలో ఈరోజు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలుసుకుని సంఘీభావం తెలియజేయడం జరిగింది.

ఈ సందర్భంగా గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న లక్షలాది మంది తెలుగు ప్రవాసాంధ్రుల ప్రయాణ అవసరాలను దృష్టిలో ఉంచుకుని, గల్ఫ్ దేశాల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన విమానాశ్రయాలకు నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేయడం జరిగింది.

ప్రస్తుతం గల్ఫ్ నుంచి స్వరాష్ట్రానికి రావాలనుకునే అనేక మంది ప్రవాసాంధ్రులు ఇతర నగరాల మీదుగా ప్రయాణించాల్సి వస్తోంది. దీనివల్ల సమయం, అదనపు ఖర్చులు, కుటుంబ సభ్యులకు కలిగే ఇబ్బందులు పెరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌కు నేరుగా అంతర్జాతీయ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తే గల్ఫ్ ప్రవాసాంధ్రులతో పాటు వారి కుటుంబాలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని, రాష్ట్రానికి కూడా అంతర్జాతీయ కనెక్టివిటీ మరింత మెరుగుపడుతుందని వివరించడం జరిగింది.

గల్ఫ్ ప్రవాసాంధ్రుల ప్రయాణ సౌకర్యం కోసం… ఆంధ్రప్రదేశ్‌కు అంతర్జాతీయ విమాన కనెక్టివిటీ పెంపునకు మరో ప్రయత్నం.

ముక్కెర్ల వాసుదేవరావు
Vasu Gulf Prime Journalist
APNRT Gulf Regional Coordinator

#ఆంధ్రప్రదేశ్ #గల్ఫ్NRI #రాజకీయాలు #తెలుగుసంసృతి
గల్ఫ్ ప్రవాసాంధ్రులకు శుభవార్త దిశగా మరో ప్రయత్నం… ఏపీకి డైరెక్ట్ విమాన సర్వీసులు నడపాలని కేంద్ర మంత్రికి వాసుదేవరావు విజ్ఞప్తి! నిమ్మాడలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు…