తన ఆధ్యాత్మిక యాత్రలో భాగంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బృందావన్‌ను సందర్శించారు. ఈ సంర్భంగా ఆయన గోవర్థన గిరి ప్రదక్షిణలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా దేశం, దేశ ప్రజలు సంక్షేమ కోసం భగవంతుడుని ప్రార్థించినట్టు చెప్పారు.
అంతకుముంది ఆయన తొలుత గిరిరాజ్ ముఖారవింద్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం గోవర్థన పర్వతం చుట్టూ ప్రదక్షిణ చేపట్టారు. ఈ సందర్భంగా మార్గం మధ్యలోని పలు ప్రాంతాల్లో భక్తులు ఆయనకు స్వాగతం పలికారు.
గోవర్థన ప్రదక్షిణ మార్గంలో స్థానిక కళాకారులు ప్రత్యేక సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీకృష్ణుడి జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలను ప్రతిబింబింఛేలా కృష్ణలీల ప్రదర్శలు ఇవ్వగా, వాటిని అనంత్ అంబానీ ఆసక్తిగా తిలకించారు.
తన ఆధ్యాత్మిక అనుభూతిని ఆయన వివరిస్తూ, గిరిరాజ్ ధరణ్ పాదాల చెంత ఉండటం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. తన తాతయ్య, నానన్మల వల్లే తాను ఇక్కడికి రాగలిగానని తెలిపారు. తాను గోవర్థన ప్రదక్షిణకు వస్తున్నట్టు చెప్పినపుడు వారు ఎంతో సంతోషించారని వెల్లడించారు. వారి తరపున కూడా స్వామివారికి నమస్కరించినట్టు తెలిపారు.
కాగా, ఈ గోవర్థన గిరి ప్రత్యేక ఏంటో పరిశీలిస్తే, హిందూ పురాణాల ప్రకారం.. బ్రజ్ ప్రాంత ప్రజలను ఇంద్రుడు ఆగ్రహం నుంచి రక్షించేందుకు శ్రీకృష్ణుడు తన చిటికెన వేలిపై గోవర్థన పర్వతాన్ని ఎత్తిపట్టారు. ఈ ఘట్టానికి గుర్తుగా గోవర్థన పూజను ఎంతో ఘనంగా నిర్వహిస్తారు. గోవర్థన పర్వతం చుట్టూ సుమారు 21 కిలోమీటర్ల మేరక సాగే ప్రదక్షిణకు యేడాది పొడవునా భక్తులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. ఈ ప్రదక్షిణను పూర్తి చేయడం భక్తులు పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక కార్యంగా భావిస్తారు. కాగా ఈ 21 కిలోమీటర్ల దూరాన్ని అనంత్ అంబానీ 3 గంటల్లో పూర్తి చేశారు.