దేశంలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై రాజకీయ వేడి మరింత పెరుగుతోంది. ఈ అంశంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు లేఖ రాస్తూ, బిల్లుకు మద్దతు కోరేందుకు ప్రభుత్వం గతంలోనే పలుమార్లు కాంగ్రెస్‌ను సంప్రదించిందని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం మార్చి 16, మార్చి 26, ఏప్రిల్ 12 తేదీల్లో కాంగ్రెస్‌కు లేఖలు రాసి మద్దతు కోరిందని రిజిజు పేర్కొన్నారు. అంతేకాకుండా, పార్లమెంట్ వర్షాకాల సమావేశాల సమయంలో రాహుల్ గాంధీని కూడా సంప్రదించినట్లు తెలిపారు.
కాంగ్రెస్‌తో మాత్రమే కాకుండా, డీఎంకే, సమాజ్‌వాదీ పార్టీ (SP), వైఎస్సార్‌సీపీ, ఎన్సీపీ, శివసేన (ఉద్ధవ్ బాలాసాహెబ్ థాకరే), ఎంఐఎం, బీజేడీ వంటి పార్టీలతోనూ ఈ అంశంపై సంప్రదింపులు జరిపినట్లు ఆయన వివరించారు.
అసలు వివాదం ఏమిటి?
నియోజకవర్గాల పునర్విభజన దేశ రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం చూపే కీలక అంశం. జనాభా ప్రాతిపదికన సీట్ల కేటాయింపులో రాష్ట్రాల మధ్య సమతుల్యత, దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యం, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి అంశాలు ఈ చర్చలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
కేంద్రం అన్ని పార్టీలను సంప్రదించిందని చెబుతుండగా, ఈ ప్రక్రియపై ప్రతిపక్షాల వైఖరి, వాటి అభ్యంతరాలు రాజకీయంగా కీలకంగా మారాయి. మాతో మాట్లాడలేదు అని బహిరంగముగా ప్రతిపక్షాలు ప్రభుత్వము మీద ఆరోపణలు చేచేస్తుండటంతో ఈ సారి ఈ లేఖలను బహిరంగముగా విడుదల చేశారు .