షేర్: f 𝕏 ✉ ✈ in @
subhodayammedia.com 26 నవం 2026, 3:22 సా.
రాజకీయాలు

బీహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి పెళ్లి: కరెన్సీ నోట్లు వర్షించాయి, వంటకాల కోసం ఎగబడ్డారు, వీడియో

subhodayam
ప్రచురణ తేదీ: 26 నవం 2026, 3:22 సా. రచన: Subhodayam Media
7 వీక్షణలు 0 వ్యాఖ్యలు
బీహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి పెళ్లి: కరెన్సీ నోట్లు వర్షించాయి, వంటకాల కోసం ఎగబడ్డారు, వీడియో

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బీహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి సింగ్ పెళ్లి గురించిన వార్తలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. బీహార్ ప్రజలు తిండి కోసం ఇంతగా మొహం వాచిపోయి వున్నారా అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలను చూసి పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. బీహార్‌లోని మొకామా శాసనసభ్యుడు అనంత్ సింగ్ కుమార్తె శివాంగి సింగ్ వివాహానికి బుధవారం నాడు సుమారు పది లక్షల మంది అతిథులు హాజరయ్యారని సమాచారం. ఈ సంఖ్య ఇంకా ధృవీకరించబడలేదు.

ఈ వివాహానికి సంబంధించిన వీడియోలు, అక్కడ నెలకొన్న గందరగోళంతో సహా ఆ వేడుకలోని వివిధ పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఆన్‌లైన్‌లో ప్రచారంలో ఉన్న ఒక క్లిప్‌లో, అతిథులు తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. తాగే గ్లాసులను ప్లేట్లుగా ఉపయోగించడం, భారీ వంట పాత్రల నుండి నేరుగా ఆహారాన్ని గరిటెతో తీసుకుని తినడం, చేతులతో కూరల్లో వున్న ముక్కులను ఏరుకుని తినడం, చివరకు కార్డ్‌బోర్డ్ పెట్టెల్లో ప్యాక్ చేసుకుని తీసుకువెళ్లడం వంటివి చేశారు.

ఈ తాత్కాలిక ఏర్పాట్లు, స్వీట్ల కోసం జరిగిన తొక్కిసలాటకు సంబంధించిన ఇతర వీడియోలు కూడా సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాయి. బీహార్ అంతటా 'ఛోటే సర్కార్'గా పేరుగాంచిన సింగ్, ఈ వివాహానికి ప్రజలందరికీ బహిరంగ ఆహ్వానం పంపారు. దీనివల్లే ఇంత భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. నద్వాన్ గ్రామంలో వివాహ విందు ఏర్పాటు చేసినప్పటికీ, జన సమూహాన్ని అదుపు చేయడంలో నిర్వాహకులు ఇబ్బంది పడ్డారు.

స్వీట్ల కౌంటర్ వద్ద పరిస్థితి అదుపు తప్పింది. రెప్పపాటులో రసగుల్లాలు మాయమయ్యాయి. వైరల్ అయిన ఒక వీడియోలో, "ఇక్కడ ఆహారం దొరకడం ఒక యుద్ధంలో గెలిచినట్లే" అని చెప్పి అక్కడి పరిస్థితిని చక్కగా సంగ్రహించారు. భారీ జనసమూహం కారణంగా ఐదు నుండి పది కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రజలు కార్లలో, ట్రాక్టర్లపై, కాలినడన వచ్చారు.

అక్కడ ఓ తాత్కాలిక వంటగది, థార్ ఎస్‌యూవీతో గుర్రపు పందెం, వీఐపీ అతిథుల కోసం సమీపంలో ఒక హెలిప్యాడ్, ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ఏర్పాట్లకు పోటీ ఇచ్చేలా ఒక టెంట్ సిటీ ఉన్నాయి. సింగ్ కుమార్తె శివాంగి, కమాండెంట్ రణ్‌విజయ్ కుమార్ కుమారుడైన రిషికేష్ కుమార్‌ను వివాహం చేసుకుంది. అతను అట్లాంటాలోని జార్జియా స్టేట్ యూనివర్శిటీ నుండి ఎంబీఏ పూర్తి చేశాడు. తిలకధారణ సమయంలో అతనికి సుమారు రూ. 3 కోట్ల విలువైన తెల్లటి ల్యాండ్ రోవర్ డిఫెండర్‌తో పాటు, 100 గ్రాముల బంగారు గొలుసు, 80 గ్రాముల బంగారు బ్రాస్‌లెట్‌ను బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం. ఇదే ఇలా వుంటే... ఇక కట్నకానుకల రూపంలో ఎన్ని కోట్లు సమర్పించి వుంటారో?!!

#రాజకీయాలు
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా బీహార్ ఎమ్మెల్యే అనంత్ సింగ్ కుమార్తె శివాంగి సింగ్ పెళ్లి గురించిన వార్తలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. బీహార్ ప్రజలు తిండి కోసం…