షేర్: f 𝕏 ✉ ✈ in @
subhodayammedia.com 24 నవం 2026, 10:46 ఉద.
ఆస్ట్రేలియా

Australia Cricket: మరో బాల్ ట్యాంపరింగ్ ప్లాన్?.. వెలుగులోకి సంచలన విషయాలు!

subhodayam
ప్రచురణ తేదీ: 24 నవం 2026, 10:46 ఉద. రచన: Subhodayam Media
9 వీక్షణలు 0 వ్యాఖ్యలు
Australia Cricket: మరో బాల్ ట్యాంపరింగ్ ప్లాన్?.. వెలుగులోకి సంచలన విషయాలు!

Fresh Ball-Tampering Allegations on Australia Cricket: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును మరోసారి బాల్ ట్యాంపరింగ్ వివాదం వెంటాడుతోంది. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో వెలుగుచూసిన శాండ్‌పేపర్‌గేట్ ఘటనకు సంబంధించి తాజాగా సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆస్ట్రేలియాకు చెందిన సెన్ మీడియా సంస్థ కోసం జర్నలిస్ట్ గెరార్డ్ వాట్లీ నిర్వహించిన పరిశోధనలో.. పాకిస్థాన్‌తో 2018 అక్టోబర్‌లో దుబాయ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బంతి స్వభావాన్ని మార్చేందుకు మింట్స్ ఉపయోగించాలనే ఆలోచన జట్టులో చర్చకు వచ్చినట్లు ఆరోపణలు వెల్లడయ్యాయి.

నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌పై బౌలర్లు పిచ్ నుంచి ఆశించినంతగా స్వింగ్ రాబట్టలేకపోవడంతో కొందరు ఆస్ట్రేలియా ఆటగాళ్లు బంతిని ట్యాంపరింగ్ చేసే మార్గాల గురించి చర్చించారట. ఈ క్రమంలో మింట్స్ ఉపయోగించే అవకాశాన్ని ఓ ఆటగాడు ప్రస్తావించినట్లు సమాచారం. ‘మింట్స్ ఎవరి దగ్గర ఉన్నాయి?. ఈరోజు బంతిపై ఎవరు రుద్దుతారు’ అంటూ అతడు ప్రశ్నించినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఈ సూచనకు జట్టులోని మరో సభ్యుడు తీవ్ర అభ్యంతరం తెలిపినట్లు వెల్లడించింది. ఈ వ్యవహారం గురించి తెలుసుకున్న అప్పటి ఆస్ట్రేలియా హెడ్ కోచ్ జస్టిన్ లాంగర్ ఆటగాళ్లను నిలదీసినట్లు నివేదిక తెలిపింది. బంతిని ట్యాంపరింగ్ చేయాలనే ఆలోచనపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారట. అప్పటి కెప్టెన్ టిమ్ పైన్ కూడా జోక్యం చేసుకుని అలాంటి ఘటన జరగకుండా చర్యలు తీసుకున్నట్లు కథనం పేర్కొంది. దక్షిణాఫ్రికాలో శాండ్‌పేపర్ వివాదం జరిగిన ఆరు నెలలకే ఈ చర్చ తెరపైకి వచ్చినట్లు నివేదిక వెల్లడించింది.

శాండ్‌పేపర్‌గేట్ వివాదం సమయంలో జట్టులో చోటుచేసుకున్న అంతర్గత పరిణామాలపైనా ఈ నివేదిక పలు విషయాలను బయటపెట్టింది. ఈ ఘటనలో తన పాత్రపై డేవిడ్ వార్నర్‌ను మిచెల్ మార్ష్ నిలదీసినట్లు పేర్కొంది. అప్పట్లో కామెరాన్ బాన్‌క్రాఫ్ట్ మొత్తం బాధ్యతను తనపై వేసుకోవడానికి సిద్ధమైనప్పటికీ.. స్టీవ్ స్మిత్ మాత్రం ఈ వ్యవహారంలో బాధ్యతను పంచుకోవాలని భావించినట్లు తెలిపింది. జట్టు హోటల్‌లో వార్నర్‌తో మార్ష్ తీవ్రంగా వాదించినట్లు ఓ వర్గం వెల్లడించింది. ‘ఈసారి నువ్వు తప్పించుకోలేవు మిత్రమా.. బాంగర్స్ (బాన్‌క్రాఫ్ట్) ఒక్కరినే బాధ్యుడిగా చేయడానికి మేము అంగీకరించం’ అని వార్నర్‌తో చెప్పినట్లు కథనం పేర్కొంది.

2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో బంతి ఆకారాన్ని మార్చేందుకు శాండ్‌పేపర్ ఉపయోగించిన ఘటన అప్పట్లో ప్రపంచ క్రికెట్‌ను కుదిపేసింది. ఈ వివాదంలో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై 12 నెలల నిషేధం విధించగా.. కామెరాన్ బాన్‌క్రాఫ్ట్‌పై తొమ్మిది నెలల సస్పెన్షన్ విధించారు. తాజాగా దుబాయ్ టెస్టులో మింట్స్‌తో బంతి స్వభావాన్ని మార్చాలనే ఆలోచనపై వచ్చిన ఆరోపణలు ఆస్ట్రేలియా క్రికెట్‌లో మరోసారి చర్చకు దారితీశాయి.

#ఆస్ట్రేలియా #క్రికెట్
Fresh Ball-Tampering Allegations on Australia Cricket: ఆస్ట్రేలియా క్రికెట్ జట్టును మరోసారి బాల్ ట్యాంపరింగ్ వివాదం వెంటాడుతోంది. 2018లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో వెలుగుచూసిన శాండ్‌పేపర్‌గేట్ ఘటనకు…