అమెరికా: అట్లాంటా వేదికగా అత్యంత ఘనంగా, వైభవంగా జరిగిన శంకర నేత్రాలయ యుఎస్ఏ గ్రాండ్ వార్షికోత్సవం.

శంకర నేత్రాలయ యుఎస్ఏ అధ్యక్షులు శ్రీ బాలారెడ్డి ఇందుర్తి గారి నాయకత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 14 చాప్టర్ల ప్రతినిధులు ఒకే వేదికపైకి రావడం విశేషం.

ఇది కేవలం వార్షికోత్సవం మాత్రమే కాదు, ఒకే ఆశయం, ఒకే సేవా దృక్పథం కలిగిన వారందరూ కలుసుకున్న ఒక అందమైన కుటుంబ కలయికలా అనిపించింది.

ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహకరించిన దాతలు, మద్దతుదారులు, సాంస్కృతిక అకాడమీలు, కళాకారులు, స్వచ్ఛంద సేవకులు మరియు నిర్వాహకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.

అంధత్వ నిర్మూలన, పేదలకు చూపును ప్రసాదించే ఈ మహోన్నత లక్ష్యం కోసం కలిసి పని చేయడం గర్వకారణమని నిర్వాహకులు తెలిపారు.
