షేర్: f 𝕏 ✉ ✈ in @
subhodayammedia.com 26 నవం 2026, 11:19 సా.
ఆంధ్రప్రదేశ్

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్

subhodayam
ప్రచురణ తేదీ: 26 నవం 2026, 11:19 సా. రచన: Subhodayam Media
9 వీక్షణలు 0 వ్యాఖ్యలు
AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల్లో 77.65 శాతం పోలింగ్.. మూడు చోట్ల రేపు రీపోలింగ్

AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన తుది నివేదిక విడుదలైంది. మొత్తం 3,189 సర్పంచ్, 25,057 వార్డు సభ్యుల స్థానాలకు నవంబర్‌లో నిర్వహించిన పోలింగ్‌లో సగటున 77.65 శాతం ఓటింగ్ నమోదైంది. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 83.37 శాతం పోలింగ్ నమోదుకాగా, అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 58.85 శాతం ఓట్లు పోలయ్యాయి.

మరోవైపు, కొన్ని ప్రాంతాల్లో బ్యాలెట్ బాక్సుల ధ్వంసం, బ్యాలెట్ పత్రాలను చించివేయడం, ఇంకు పోయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనల నేపథ్యంలో మూడు చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. పల్నాడు జిల్లాలోని బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఒకటో వార్డు స్థానానికి, అదే మండలంలోని గరికపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ స్థానానికి రీపోలింగ్ జరగనుంది. అలాగే శ్రీ సత్యసాయి జిల్లాలోని కనగానపల్లి మండలం నర్సంపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్, ఏడో వార్డు స్థానానికి కూడా మళ్లీ పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ మూడు చోట్ల రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రీపోలింగ్ జరగనుంది. ఇక, మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్లను లెక్కించి ఫలితాలను ప్రకటించనున్నారు..

#ఆంధ్రప్రదేశ్ #ఎన్నికలు #రాజకీయాలు
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించిన తుది నివేదిక విడుదలైంది. మొత్తం 3,189 సర్పంచ్, 25,057 వార్డు సభ్యుల స్థానాలకు నవంబర్‌లో నిర్వహించిన పోలింగ్‌లో సగటున…