షేర్: f 𝕏 ✉ ✈ in @
subhodayammedia.com 24 నవం 2026, 10:07 సా.
మహిళ

15మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు.. డబ్బు, నగలే కాదు.. అవన్నీ దోచుకున్నాడు..

subhodayam
ప్రచురణ తేదీ: 24 నవం 2026, 10:07 సా. రచన: Subhodayam Media
9 వీక్షణలు 0 వ్యాఖ్యలు
15మంది మహిళలను పెళ్లి చేసుకున్నాడు.. డబ్బు, నగలే కాదు.. అవన్నీ దోచుకున్నాడు..

35-year-old man marries 15 women

పెళ్లితో మోసం చేశాడు. వారి వద్ద భారీగా నగదుతో పాటు ఆభరణాలను కూడా దోచుకున్నాడు. ఇంకా వారి ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేశాడు. చివరికి బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని పట్టుకున్నారు. వివరాల్లోకి వెళితే... ఘజియాబాద్‌కు చెందిన 35 ఏళ్ల నరేంద్ర శర్మ వరుసగా 15మంది మహిళలను వివాహం చేసుకున్నాడు.

వారి నుంచి డబ్బు, నగలు దోచుకోవడమే కాకుండా, వారి అశ్లీల ఫోటోలు, వీడియోలను తీసి వాటితో వారిని బ్లాక్‌మెయిల్ చేసేవాడు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, రాజస్థాన్, మహారాష్ట్రలకు చెందిన మహిళలను నరేంద్ర వివాహం చేసుకున్నాడు. వీరిలో మీరట్‌కు చెందిన ఒక మహిళ కూడా ఉంది. ఆమెను వివాహం చేసుకున్న తర్వాత, అతను ఆమెతో కలిసి ఘజియాబాద్‌లో నివసించడం ప్రారంభించాడు.

నరేంద్ర ప్రవర్తనపై అనుమానం రావడంతో, ఆ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన పోలీసులు నరేంద్ర కోసం గాలించి, ఆదివారం అతడిని అరెస్టు చేశారు. నరేంద్ర మోసానికి గురైన బాధితుల్లో ఒకరు, అతడిని కోర్టులో హాజరుపరిచిన సమయంలో అక్కడికి చేరుకున్నారు. 

అతను తన జీవితాన్ని నాశనం చేశాడని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. అతను కేవలం తనను మాత్రమే కాకుండా, మొత్తం 15 మంది మహిళలను వివాహం చేసుకున్నాడని ఆమె తెలిపింది. 

తాను ధనవంతుడినని నమ్మించి, ఎంతోమంది మహిళల జీవితాలను నాశనం చేయడమే కాకుండా, వారి గౌరవంతో ఆడుకున్నాడని ఆమె పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

#మహిళ
35-year-old man marries 15 women పెళ్లితో మోసం చేశాడు. వారి వద్ద భారీగా నగదుతో పాటు ఆభరణాలను కూడా దోచుకున్నాడు. ఇంకా వారి ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేశాడు.…